తాడిడాన్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై గ్రామసభ

రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు రూ.5 లక్షల బీమా అవకాశం: ఎంపీడీవో శంకర్

తాడిడాన్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై గ్రామసభ

చౌటకూర్ : చౌటకూర్ మండల పరిధిలోని తాడిడాన్‌పల్లి గ్రామపంచాయతీలో శుక్రవారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో కే. శంకర్ హాజరై పథకానికి సంబంధించిన వివరాలను గ్రామస్తులకు వివరించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో శంకర్ మాట్లాడుతూ.. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం నుంచి ఒకరికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా రూ.5 లక్షల బీమా పొందే అవకాశం ఉందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారి నుంచి 59 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నవారు ఈ పథకానికి అర్హులని వివరించారు.అర్హత కలిగిన రేషన్ కార్డు దారులందరూ అవసరమైన వివరాల కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శి సిద్ధమ్మను సంప్రదించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ గ్రామసభలో ఉపసర్పంచ్ మౌలానా, పంచాయతీ కార్యదర్శి సిద్ధమ్మ, అంగన్‌వాడీ టీచర్, ఆశా కార్యకర్తతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News