తాడిచర్ల పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్
మల్హర్ రావు : మండలంలోని తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ మధుసూదన్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సందీప్‌తో కలిసి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని సిబ్బంది హాజరు పట్టిక, ఓపీ వివరాలు, రోగుల వివరాలు, మందుల నిల్వలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. ఈ వివరాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వినయ్ భాస్కర్‌ను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటించాలని, విధులకు క్రమం తప్పకుండా హాజరుకావాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


