దీపావళి పండుగ సందర్భంగా పేకాట పూర్తిగా నిషేధం
పేకాట ఆడినా , ఆడించినా కఠిన చర్యలు తప్పవు – పోలీస్ కమిషనర్ వెల్లడి
పండుగ నేపథ్యంలో స్పెషల్ టీం లు మరియు పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు
నిజామాబాద్ : దీపావళి పండుగ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్లలో పేకాటను పూర్తిగా నిషేధించినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ తెలిపారు. పండుగ సమయంలో ఎవరైనా పేకాట ఆడినా , పేకాట స్థావరాలు నిర్వహించినా , ఇతరులను పేకాట ఆడేందుకు ప్రోత్సహించినా లేదా పేకాట నిర్వహణకు సహకరించినా వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు పేకాటపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి , ఎక్కడైనా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందితే తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారిచేసారు. ప్రజలు కూడా తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా పేకాట ఆడుతున్నా , ఆడిస్తున్నా లేదా పేకాట నిర్వహణకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిసినా వెంటనే నిజామాబాదు పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712659700 కు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ కోరారు. పండుగ నేపథ్యంలో స్పెషల్ టీం లు మరియు పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రజలు సహకరించాలి – పండుగను ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలి.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


