హాజీపూర్ లో టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
హాజీపూర్ : (మంచిర్యాల) టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్ శాఖ హాజీపూర్ ఎంపిడిఓ కార్యాలయం లో పనిచేస్తున్న 15 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సభ్యత్వం తీసుకోవడం జరిగినది. ఈ సందర్భంగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో టిఎన్జీవో సంఘం ఎల్లవేళలా కృషి చేస్తుందని మరియు మంచిర్యాల జిల్లాలోని ఇంకా మిగిలిన యూనిట్లో సభ్యత్వ నమోదును అతి తొందరలోనే పూర్తి చేసి పూర్తిచేసి రాష్ట్రంలోనే మన మంచిర్యాల జిల్లా మొదటి స్థానంలో ఉంటాదని అదేవిదంగా రాష్ట్రం లోనే మంచిర్యాల జిల్లా ఆదర్శంగా ఉండాలని తెలిపారు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టిఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు ఉపాధ్యక్షులు నరేందర్ మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ పంచాయతీ రాజ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

