పేద కుటుంబాలకు ఆర్థిక భరోసానే ఇందిరమ్మ బీమా లక్ష్యం
ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
పెద్ద శంకరంపేట్ : ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లక్ష్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. శంకరంపేట్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు బీమా పథకం పత్రాలను అందజేశారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించడం ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా పలు సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని నూతన గృహాల్లోకి అడుగుపెట్టిన కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్, ఎమ్మార్వో నారాయణ, ఎంపీడీవో షాకీర్ అలీ, సర్పంచ్ జంగం రేణుక, ఉప సర్పంచ్ రాజా గౌడ్, నాయకులు మధుసూదన్, దానంపల్లి నారాగౌడ్, మురళి పంతులు, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

