వివాహ మహోత్సవనికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన టీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ బాపురావు
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా కేంద్రం పద్మనాయక గార్డెన్ మావల లో రాథోడ్ ప్రకాష్ కూతురి వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వివాహ కార్యక్రమానికి *తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహ వేడుకలో పాల్గొన్న టిఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ బాపురావు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వివాహాలు, శుభకార్యాలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయులు ఒకచోట చేరి ఆనందాన్ని పంచుకునే ప్రత్యేక సందర్భాలని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలపడం సామాజిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. తమ కుటుంబ శుభకార్యానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన రాథోడ్ బాపురావుకు ప్రకాష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య కొనసాగింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


