దిక్షా దివస్ బిఆర్ఎస్ ఫ్లెక్సీలు తొలగించడంపై నాయకుల ధర్నా
ఫ్లెక్సీలు తొలగించిన వారిపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ హామీ
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దిక్షా దివస్ ప్లెక్సీని మున్సిపల్ అధికారులు తొలగించడంపై శుక్రవారం రోజున స్థానిక బిఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు బిఆర్ఎస్ దిక్షా దివస్ ప్లెక్సీలు ఎందుకు తొలగించారని మున్సిపల్ నిబంధనలు బిఆర్ఎస్ మాత్రమే వర్తిస్తాయా మరి కాంగ్రెస్ అధికార పార్టీ నాయకుల ఫ్లెక్సీలు ఎలా ఉన్నాయని నిబంధనలు వారికి వర్తించవా అంటూ మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు.పట్టణంలో ఫ్లెక్సీల విషయంలో మున్సిపల్ అధికారులు పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని బిఆర్ఎస్ ఆరోపించింది. నిబంధనలు అందరికీ సమానంగా వర్తించాలి కానీ ఒక పార్టీకి ఒక న్యాయం మరో పార్టీకి మరో ఆన్యాయం చేయడం సమంజసం కాదని అన్నారు. ధర్నా వద్దకు మున్సిపల్ కమిషనర్ టి. మల్లికార్జున్ గౌడ్ చేరుకొని తనకు తెలియకుండానే తొలగించారని ఫ్లెక్సీలు తొలగించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో బిఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గాదెపాక రవీందర్, బొల్లి శ్రీనివాస్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పేరుక భాగ్యరెడ్డి, నాయకులు ఎండి అన్వర్ అయిలేని మల్లికార్జున్ రెడ్డి, కన్నోజు రామకృష్ణ,పచ్చిమట్ల సంపత్, పెరుమాండ్ల శ్రీనివాస్,యాస శ్రీనివాస్,కుతాటి విజయభాస్కర్, బూర. వెంకన్న, బోజు రవీందర్, గడ్డం సదానందం, వాల నవీన్,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

