‘నషా ముక్త్ భారత్ అభియాన్’ ప్రచార రథాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా,

‘నషా ముక్త్ భారత్ అభియాన్’ ప్రచార రథాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా,

ఆదిలాబాద్ బ్యూరో  :  స్థానిక ఆదిలాబాద్ బ్రహ్మకుమారీస్ సేవా కేంద్రంలో నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్ ‘మిషన్ స్పందన్’ అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రచార రథాన్ని ప్రారంభించారు. వ్యసన రహిత సమాజ నిర్మాణం "నషా ముక్త్ తెలంగాణ" లక్ష్యంగా ప్రజల్లో విస్తృత చైతన్యం కల్పించేందుకు ఈ ప్రచార రథాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు దురలవాట్లు యువత భవిష్యత్తును, కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యసన రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రభుత్వ విభాగాలు సంయుక్తంగా చేపడుతున్న ఈ ప్రచార కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జ్యోతి, బీకే రేవతి, పుష్ప, గీత, అర్చన, తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపిక రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపిక
చౌటకూర్ :  చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు.ఈ నెల 19న మెదక్‌లో నిర్వహించిన...
అల్లాదుర్గం మండల స్థాయి క్విజ్ పోటీల నిర్వహణ
ప్రతి కుటుంబానికి రూ5 లక్షల భీమా పథకం
తాడిడాన్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై గ్రామసభ
మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చేతుల మీదుగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ఇందిరా గాంధీకి ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ కొండ రాజమ్మ
కారుపాకల కొమురయ్య మృతికి సర్పంచ్ బండి స్వామి సంతాపం