ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాల సమస్యల పరిష్కరించాలి
మంచిర్యాల : శుక్రవారం టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కి ఎస్సీ ఎస్టీ బిసి సంక్షేమ శాఖ వసతి గృహాల సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ, బిసి సంక్షేమ వసతి గృహాలలో నాకఫ్ సరుకుల సరఫరా మరియు ఇతర సమస్యలపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు విన్నవించుకున్నారు దానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారని ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో టిఎన్జీవో వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మోసిన్ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


