మోస్రా మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభం
నిజామాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద అర్హులైన లబ్ధిదారుల నమోదు ప్రక్రియ మోస్రా మండలంలో కొనసాగుతోంది. నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు మోస్రాలో మూడు రిజిస్ట్రేషన్ కౌంటర్లు, హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. అర్హులైన లబ్ధిదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ దరఖాస్తుల నమోదు చేపడుతున్నారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి శ్రీ ఏ. పురుషోత్తం గారు నమోదు కేంద్రాలను సందర్శించి, జరుగుతున్న నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకంపై అవగాహన కల్పించి, నమోదు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో MPO, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ అధికారి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


