ప్రతి కుటుంబానికి రూ5 లక్షల భీమా పథకం

ప్రతి కుటుంబానికి రూ5 లక్షల భీమా పథకం

అందోల్ : సంగారెడ్డి జిల్లా జోగిపేటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం రూ 5 లక్షల జీవిత భీమా ప్రతి కుటుంబానికి ఆర్థికంగా భరోసా నివ్వడానికి ప్రభుత్వం చేపట్టిన అద్భుతమైన పథకంమని మున్సిపల్ కౌన్సిలర్ కోషికే రాజశేఖర్ 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు నిండి ఉన్న ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు అందుబాటులో ఉన్న ప్రతి లబ్ధిదారునికి ఇది చెందుతుందన్నారు. ఈకార్యక్రమం మున్సిపల్ చైర్మన్ ఎస్. కృష్ణ రెడ్డి,వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ చిట్టిబాబు,మున్సిపల్ కమీషనర్ తిరుపతి, బిక్షపతి, మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ ఎస్ జగన్ మోహన్ రెడ్డి , మాజీ కౌన్సిలర్ ఎస్ సురేందర్ గౌడ్, కౌన్సిలర్లు పట్లోళ్ల శ్రీనివాస్,మర్రి అరుణకుమారి,తోట్ల రామకృష్ణ,కో ఆప్షన్ మెంబర్స్ పిట్ల భాగ్యలక్ష్మి లక్ష్మణ్,డేవిడ్, మాజీ కౌన్సిలర్లు ప్రదీప్ గౌడ్,అల్లే శ్రీకాంత్, దుర్గేష్,పిట్ల లక్ష్మణ్, చేనేత సహకారం సంఘము అధ్యక్షుడు పడిగే సత్యం అధికారులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News