పేట కార్యాలయంలో కనిపించని జయంతి సందడి...

గ్రూపు రాజకీయాలా.. జిల్లా అధ్యక్షుడి నాయకత్వ నిర్లక్ష్యమా.?

పేట కార్యాలయంలో కనిపించని జయంతి సందడి...

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి బాధ్యతారాహిత్యంపై సీనియర్ల అసంతృప్తి..

గ్రూపు విభేదాలే పార్టీ కార్యక్రమాలకు అడ్డంకిగా మారాయా..

జాతీయ నాయకురాలి జయంతి వేడుకలకూ సమన్వయం కరువైందా..

పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు సీనియర్ నాయకుల సన్నాహాలు..

సూర్యాపేట : దేశవ్యాప్తంగా ఉక్కు మహిళ, భారతదేశ తొలి మహిళా ప్రధాని, భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తుండగా.. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో మాత్రం జయంతి కార్యక్రమాలు నిర్వహించకపోవడం చర్చనీయాంశంగా మారింది.ఒకవైపు తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం చేయూత పింఛన్లు, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా వంటి ప్రతిష్టాత్మక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న తరుణంలో, ఆ పథకాల వెనుక ఉన్న ఇందిరాగాంధీ పేరును స్మరించుకునే జయంతి వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఎందుకు నిర్వహించలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.పార్టీలో గొప్పలు చెప్పుకునే నాయకులు ఇలాంటి ముఖ్యమైన సందర్భాల్లో ఎక్కడ ఉన్నారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. గ్రూపు విభేదాల కారణంగానే జయంతి వేడుకలకు దూరంగా ఉన్నారా..? లేక జిల్లా పార్టీ నాయకత్వం నుంచి తగిన ఆదేశాలు, సమన్వయం లేకపోవడమే కారణమా..? అన్న చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో సాగుతోంది.ఈ వ్యవహారంపై పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి పీసీసీకి ఫిర్యాదు చేస్తామని కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నట్లు సమాచారం..ఇందిరాగాంధీ వంటి జాతీయ నాయకురాలి జయంతి వేడుకల విషయంలోనూ సమన్వయం లేకపోవడంపై కాంగ్రెస్ శ్రేణులు సమాధానం కోరుతున్నాయి. ఇందిరాగాంధీ వంటి జాతీయ నాయకురాలి జయంతి వేడుకల విషయంలోనే సమన్వయం కొరవడితే, పార్టీ శ్రేణులకు నాయకత్వం ఎలాంటి సందేశం ఇస్తున్నట్లు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కాంగ్రెస్ నాయకత్వం ఈ వ్యవహారంపై స్పందించి, పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ఐక్యతను చాటుకోవాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

5b19d32f-43ba-4fa1-81e7-b96c9003d686

Views: 36

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News