ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు అండ..... మెప్మ పి డి సి వి ఎన్ రాజు,మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం  పేద కుటుంబాలకు అండ..... మెప్మ పి డి సి వి ఎన్ రాజు,మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్

ఆదిలాబాద్ బ్యూరో  : ఆదిలాబాద్ పట్టణంలోని 1వ వార్డు మహాలక్ష్మివాడ, 18వ వార్డు రణ దివ్యా నగర్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. కుటుంబాలకు కష్టకాలంలో 5లక్షల ఆర్థిక భరోసా కల్పించడంలో ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్‌తో పాటు మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మెట్మా పీడీ సి వి ఎన్ రాజు  స్పెషల్ ఆఫీసర్ కలీం గారు  వార్డు కౌన్సిలర్ అన్నపూర్ణ, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపిక రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపిక
చౌటకూర్ :  చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు.ఈ నెల 19న మెదక్‌లో నిర్వహించిన...
అల్లాదుర్గం మండల స్థాయి క్విజ్ పోటీల నిర్వహణ
ప్రతి కుటుంబానికి రూ5 లక్షల భీమా పథకం
తాడిడాన్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై గ్రామసభ
మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చేతుల మీదుగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ఇందిరా గాంధీకి ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ కొండ రాజమ్మ
కారుపాకల కొమురయ్య మృతికి సర్పంచ్ బండి స్వామి సంతాపం