ములుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి

ములుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి

ములుగు : ములుగు మండలంలో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం ములుగు మండలం పెగడపల్లి గ్రామంలో రైతులు మాట్లాడుతూ, ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటలు, బోర్లు ఎండిపోయాయన్నారు. వేసిన పంటలు నీరు లేక ఎండిపోతున్నాయని, రైతులు పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలు దెబ్బతిన్నాయని, దీంతో రైతు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని తెలిపారు. కరువు మండలంగా ప్రకటిస్తేనే రైతులకు నష్టపరిహారం, రుణ ఉపశమనం వంటి సౌకర్యాలు అందుతాయని అన్నారు. అదే విధంగా రామప్ప సరస్సు నుంచి లక్నవరం సరస్సుకు పైప్‌లైన్ ఏర్పాటు చేస్తే మండలంలోని పలు గ్రామాలకు సాగు, తాగునీటి సమస్య తీరుతుందని సూచించారు. ఈ పైప్‌లైన్ ద్వారా చెరువులు, కుంటలు నింపితే భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు జరుగుతుందని వివరించారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి కరువు మండలంగా ప్రకటించి, పైప్‌లైన్ పనులకు నిధులు కేటాయించి మండల ప్రజలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవుల లక్ష్మీనారాయణ, గొల్ల కుమార్, పెగడపల్లి సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News