70 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో సిసి రోడ్లు డ్రైనేజీలు
ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్,మున్సిపల్ ఏఈ
మక్తల్ : మక్తల్ మున్సిపాలిటీ 16 వార్డులో 70 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో సిసి రోడ్లు డ్రైనేజీ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు మరియు స్థానిక కౌన్సిలర్ ఆలుకూరి పావని తో పాటు మున్సిపల్ ఏఈ నాగ శివ ప్రారంభించారు,మొత్తం 675 మీటర్ల సిసి రోడ్లు, 480 మీటర్ల డ్రైనేజీ పనులకు పూజ చేసి ప్రారంభించామని, మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో వార్డు అభివృద్ధిలో భాగంగా 70 లక్షల కేటాయించి సిసి రోడ్లు డ్రైనేజీ పనులను ప్రారంభం చేసుకున్నందుకు మంత్రి వాకిటి శ్రీహరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహమ్మద్ షాలo, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు శంషుద్దీన్, రాజశేఖర్, కీర లింగప్ప, మహమ్మద్ వలియోద్దీన్ గురు, మానసాని కిరణ్, రహీం, సుభాష్, గోపాల్, శేఖర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


