శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క

అతిథి గృహం నిర్మాణ పనులకు భూమి పూజ

శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క

స్వాగతం పలికిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

మోర్తాడ్ : నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క శుక్రవారం భీంగల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రి గుట్టను సందర్శించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ చరిత్రను ఆలకించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయం వద్ద రూ.4 కోట్ల నిధుల అంచనా వ్యయంతో నూతనంగా  నిర్మించనున్న వసతి గృహానికి మంత్రి శంకుస్థాపన చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ భుజంగరావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మంత్రి సీతక్కకు పూల మొక్క అందించి ఘన స్వాగతం పలుకుగా, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ధర్మకర్త ఆలయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ మంత్రికి స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపిక రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపిక
చౌటకూర్ :  చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు.ఈ నెల 19న మెదక్‌లో నిర్వహించిన...
అల్లాదుర్గం మండల స్థాయి క్విజ్ పోటీల నిర్వహణ
ప్రతి కుటుంబానికి రూ5 లక్షల భీమా పథకం
తాడిడాన్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై గ్రామసభ
మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చేతుల మీదుగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ఇందిరా గాంధీకి ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ కొండ రాజమ్మ
కారుపాకల కొమురయ్య మృతికి సర్పంచ్ బండి స్వామి సంతాపం