డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి 30 రోజుల జైలు శిక్ష

విధించిన నర్సాపూర్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి 30 రోజుల జైలు శిక్ష

నర్సాపూర్ ఎస్సై ఏ. రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక
మెదక్ : మద్యం సేవించి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడిపిన ఓ వ్యక్తికి నర్సాపూర్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు 30 రోజుల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 18వ తేదీన నర్సాపూర్ ఎస్సై ఏ. రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతున్న వడ్ల అన్నమాచారి, తండ్రి వడ్ల కృష్ణమాచారి, నివాసం నర్సాపూర్ గ్రామము మరియు మండలం గారిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించి వాహనం నడిపినట్లు గుర్తించిన పోలీసులు అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. అనంతరం గురువారం నర్సాపూర్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి వడ్ల అన్నమాచారి 30 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు శిక్ష పడిన వ్యక్తిని సంగారెడ్డి జిల్లా కందిలోని జైలుకు తరలించారు. రోడ్డు భద్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి:ఎస్సై రంజిత్ రెడ్డి ఈ సందర్భంగా నర్సాపూర్ ఎస్సై ఏ. రంజిత్ రెడ్డి మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వాహనదారులు తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా యువత మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు నడపవద్దని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్సై ఏ. రంజిత్ రెడ్డి సూచించారు.

Views: 21

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News