బయ్యక్కపేటలో సమ్మక్క-సారక్క స్వాగత తోరణం ఆవిష్కరణ
బయ్యక్కపేట : బయ్యక్కపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన సమ్మక్క-సారక్క తల్లుల స్వాగత తోరణాన్ని బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా ఇంచార్జి బడే నాగజ్యోతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పంటలు బాగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తల్లులను వేడుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దండుగుల మల్లన్న, బయ్యక్కపేట మాజీ సర్పంచ్ గుర్రం రమా సమ్మిరెడ్డి, నార్లపూర్ ఎంపీటీసీ కుక్కల శ్రీనివాస్, మాజీ సర్పంచులు చిన్నక్క శివరాజ్, గొంది శ్రీధర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎల్లబోయిన ఐలయ్య తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


