వివాదానికి దారి తీస్తున్న పెన్షన్స్ ల బాగోతం

వివాదానికి దారి తీస్తున్న పెన్షన్స్ ల బాగోతం

బాల్కొండ (నిజామాబాదు జిల్లా) : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల నిధులతో తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసే వివిధ రకాల పెన్షన్ ల పంపిణిలు వివాదానికి దారి తీస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఈ పథకం ఏ ఆధాయం లేని వారికి, కూలి పని చేసె వారికి,వ్యవసాయ భూములు లేనివారికి ఈ పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది.కానీ గ్రామాల్లో ఉండే సర్పంచులతో పాటు గ్రామ పాలక మండలీకి చెందిన సభ్యులు తమ బందువుల పేర్లను అర్హుల జాబితాల్లో చేర్చు తున్నట్లు తెలుస్తుంది.పైగా తమ బందు వర్గంలో ఎకరాల కొద్ది భూములు కలిగి ఆర్ధికంగా బ్యాంక్ బాలన్స్ కలిగి ఉన్న వారి పేర్లనే మంజూరి కోసం మండల అధికారులతో మంథనాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ వ్యవహారంతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ పాలక మండలి మండల అభివృద్ధి అధికారులు కలసి పై పెన్షన్స్ లు ఇప్పించడంతో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాట్లగా బుధ,గురు వారాల్లో మా సర్వే బృందం నిజామాబాదు జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజక వర్గంలో పలు గ్రామాల్లో నిర్వహించిన సర్వే లోని వెల్లడి అయింది. నిరుద్యోగులకు పెన్షన్లు ఇవ్వాలి. తెలంగాణ వస్తే నీళ్లు నిదులు ఉద్యోగాలు వస్తాయని ఆశతో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగులను గత టిఆర్ఎస్ ప్రభుత్వం విష్మరించడంతో గ్రామాల్లోని నిరుద్యోగులు ఉద్యోగాలు రాకుండా వయసు మీరు పోతున్నారని నిరుద్యోగులకు కూడా నెలకు 1,000/- పెన్షన్ లు ఇవ్వాలని ఈ విషయాన్ని పత్రికల ద్వారా ముఖ్య మంత్రి దృష్టికి తీసుక వెళ్లాలని అనేక గ్రామాల్లోని నిరుద్యోగులు మా సర్వే బృందంతో వాపోయారు. ఏ ఆధారం తో లబ్ది దారుల్ని ఎంపిక చరస్తున్నా. రు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తoగతెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ల పథకం ఆధార్ ప్రకారంగా ఆన్లైన్ లో ఆయా లబ్ది దారుల ఆర్ధిక స్థితి గతులవివరాలు వివిధ బ్యాంక్ ఖాతాలు పరిశీలన చేస్తున్నారా ? అలాగే లబ్ది దారులకు వ్యవసాయ భూములు ఉన్నాయా లేదా?ఇలా ఏది సర్వే చేయకుండా ఏ పద్ధతి తో పెన్షన్లకు లబ్ది దారుల ఎంపిక ఎలా చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదని. చాలా గ్రామాల్లోని ప్రజలు మా ప్రతినిధితో అన్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం 60 సంవత్సరాలు నిండిన వారందరికీ,ఎకరాల కొద్ది వ్యవసాయ భూములు కలగిన వారికి,ఆర్థికంగా బాగున్నా వారికి ఈ పెన్షన్లు ఇస్తున్నట్లు తెలుస్తుంది.ఇలా చేయడం వల్ల అసలైన పేద వర్గాల ప్రజలకు పెన్షన్లు రాకుండా పోయే ప్రమాదం ఉంది, కావున ప్రభుత్వం ఉన్నత అధికారులు స్పందించి  ఏ ఆధారం లేని నిరుపేద కుటుంబాలకు, వ్యవసాయ భూములు లేనివారికి, రోజు కూలి పనులు చేసుకున్న వారికి ఈ పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది.ఈవిషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు స్పందించి ఉన్నత అధికారు లకు నిధిష్టమైన ఆదేశాలు చేయవలసిందిగా ప్రజలు కోరుచున్నారు.

ఇందిరమ్మ బీమా భరోసా లోపాయి కారి ఒప్పందాల ? తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు ప్రక్రియ ఈ నెల 20వ తేదీ నుంచిబాల్కొండ  మండలంలో ప్రారంభ మైంది. శుక్రవారం. రోజు ఉదయం 11:21 నెహ్రు నగర్ కు చెందిన ప్రజలు తమకు  సంబదించిన రేషన్ కార్డు, కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులను వెంట స్థానిక గ్రమ పంచాయతీ కి వెళ్లగ  ప్రజల ధరఖాస్థులు తీసుకో కుండా "సర్వేర్ పని చేయడం లేదని పంచాయతీ వారు చెప్పాడo తో " అవాకైనా ప్రజలు అనుమానంతో అక్కడే మాటు కసి చూడగా కొందరు బ్రోకర్లు వారికి అనుకూల మైన వారి దర ఖాస్తులు తీసుక వెల్లి ఆన్లైన్ లో అప్లోడ్ చేసినట్లు గుర్తించారు.ప్రజల నుండి నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల నమోదు, కుటుంబ వివరాల సేకరణ, ధృవీకరణ ప్రక్రియ చేపట్టడంలో జాప్యానికి గల కారణాలు ఏమిటో తెలుసుకొనేందుకు మండల అధికారుల అభిప్రాయం తీరసుకోడానికి మా ప్రతినిధి ఏం. పి. పీ. కార్యాలయానికి వెళ్లగా అధికారి అందుబాటు లో లేరు.ఇది ఇలా ఉండగ ప్రజల నుండి దరఖాస్తూల నమోదు,ధృవీకరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సిబ్బందికి సూచించారు పైగా ప్రభుత్వం మాత్రం అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకం ప్రయోజనాలు అందేలా నాలుగు విడతల్లో నమోదు ప్రక్రియను సమర్థవంతంగా
నిర్వహించేందుకు చర్యలు తీసుకున్న కూడా బాల్కొండ లో ప్రభుత్వ ఆదేశాలు అమలు జరగటం లేదని తెలుస్తుంది.  రేషన్ కార్డుల జారీ - నిరంతర పక్రియ పట్ల హర్షం. గత బి. ఆర్. ఎస్ ప్రభుత్వ  హయాంలో ఎకరాల కొద్ది వ్యవసాయ భూములు, ఆర్థికంగా బాగున్నా వాళ్లతో పాటు పార్టీ కార్యకర్తల బంధువులకు తెల్ల రేషన్ కార్డులతో పాటు " పోడు భూముల పేరుతో అటవీ భూములు కూడా కార్యకర్తలకే " ఇచ్చుకున్నట్లు అనేక ఆరోపణనాలు ఉన్నాయి.పైగా గత బి. ఆర్. ఎస్. ప్రభుత్వంలో  తెల్ల రేషన్ కార్డులు పొందిన వారిలో 5 నుండి 15 ఎకరాల వ్యవసాయ భూములు కలిగి,ఆర్థికంగా బాగున్నా వారి జాభితాను సిద్ధం చేసుకొని రేషన్ కార్డుల లబ్ది దారుల పంపిణీ స్వంత మండలాల్లో కాకుండా సుదూర అసెంబ్లీ నియోజక కేంద్రాల్లో తేల్ల రేషన్ కార్డుల పంపిణి గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించారని గతంలో పలు ఆరోపణలు వచ్చాయి.ఇలా తెల్ల రేషన్ కార్డులు పొందిన సంపన్న వర్గాల వారు ఆరోగ్యశ్రీ తో పాటు అనేక ప్రభుత్వ  సంక్షేమ పథకాలకు అర్హులుగా ఉంటు లబ్ది పొందు తున్నారని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అందుకే గత ప్రభుత్వం పై విసుగు చెందిన ప్రజలు బి. ఆర్. ఎస్ ప్రభుత్వన్ని చీత్తు.. చిత్తుగా ఓడించి మార్పు కోసం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  తెచ్చుకో గానే నిరుపేద కుటుంబాలకు అర్హులైన తెల్ల రేషన్ కార్డుల జారీ పక్రియ  నిరంతరముగా జారీ చేయడం హార్శించదగ్గ విషయమని బాల్కొండ అసెంబ్లీ నియోజిక వర్గంలోని చాలా గ్రామాల్లోని ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని మా సర్వేలో వెల్లడి అయింది.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపిక రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపిక
చౌటకూర్ :  చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు.ఈ నెల 19న మెదక్‌లో నిర్వహించిన...
అల్లాదుర్గం మండల స్థాయి క్విజ్ పోటీల నిర్వహణ
ప్రతి కుటుంబానికి రూ5 లక్షల భీమా పథకం
తాడిడాన్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై గ్రామసభ
మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చేతుల మీదుగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ఇందిరా గాంధీకి ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ కొండ రాజమ్మ
కారుపాకల కొమురయ్య మృతికి సర్పంచ్ బండి స్వామి సంతాపం