అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు
శివ్వంపేట (మెదక్): అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన శివంపేట మండలం నవాబ్‌పేటలో చోటుచేసుకుంది. కుక్కల నాగరాజు (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. రాముల తండాకు వెళ్లే మార్గంలోని కల్వర్టు కింద మంగళవారం ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


