ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలి
- ఉదారీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను వ్యతిరేకించాలి
- ఎంసీపీఐ(సి) రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి
అక్కన్నపేట,: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను ఉధృతం చేయాలని ఎంసీపీఐ(సి) రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, ఉదారీకరణ, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచాలని అన్నారు.రైతులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మహిళల సమస్యలపై ఉద్యమాలు నిర్వహించాలని సూచించారు. ‘దున్నేవాడికే భూమి’ నినాదంతో భూ సంస్కరణలు అమలు చేసి భూమిలేని పేదలకు భూమి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.కార్మిక చట్టాల సవరణలు, హేతుబద్ధీకరణ పేరుతో కార్మికుల హక్కులపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని అన్నారు. చిన్నతరహా, స్వదేశీ పరిశ్రమలను గుత్తాధిపత్య, బహుళజాతి సంస్థల నుంచి రక్షించాలన్నారు.మార్క్సిస్టు-లెనినిస్టు సిద్ధాంతాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు వామపక్ష ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విప్లవాత్మక కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ శాస్త్రీయ సోషలిజం స్థాపన లక్ష్యంగా ముందుకు సాగాలని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


