ప్రభుత్వ వైద్యకళాశాలలో ఘనంగా ధన్వంతరి జయంతి
నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో భగవాన్ ధన్వంతరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆయుష్ ఇన్ఛార్జి డాక్టర్ గంగాదాస్ ఆధ్వర్యంలో ధన్వంతరి విగ్రహానికి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమోహన్ పూలమాల వేశారు.
క్షీరసాగర మదనంలో..
డాక్టర్ గంగాదాస్ మాట్లాడుతూ దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించినప్పుడు చివరిగా చేతిలో అమృత కలశంతో ధన్వంతరి శ్రీమహావిష్ణువు అవతారంలో ఆవిర్భవించారని తెలిపారు. ఆయుర్వేద వైద్యానికి అధిపతి, దేవతల వైద్యుడైన ధన్వంతరి జయంతిని ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాత డాక్టర్ డీఎల్ఎన్ స్వామి, ఆయుర్వేద వైద్యులు శ్రీవాణి, మెడికల్ కాలేజ్ సూపర్డెంట్ నాగరాజ్ జ్యోత్స్న, అర్వింద్, విజయభాస్కర్, రామకృష్ణ, ఉమా, ఆర్బీఎస్కే ఎన్ఆర్హెచ్ఎం డీపీఎం వందన, ఆయుష్ ఫార్మసిస్ట్ న్యావనంది పురుషోత్తం, సామాజిక కార్యకర్తలు కొట్టు రమేష్, రాజేందర్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.