ఓబీసీల కు మద్దతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ రాజీనామా చేయాలి ?
పచ్చిమట్ల రవీందర్ గౌడ్, బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, హుస్నాబాద్.
హుస్నాబాద్ : దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణనలో ఓబీసీల కుల గణన కూడా చేయాలని బీఎస్పీ పార్టీ తరుపున పక్షాన మోడీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్బంగా బిఎస్పి నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఓబిసి కులాల లెక్కలు చేయాలని బీసీ సంఘాలు గత 30,40 సంవత్సరాల నుండి డిమాండ్ చేశారు.దేశ జనాభాలో 50 నుంచి 60 శాతం ఉన్న బీసీలకు ప్రస్తుతం రిజర్వేషన్లు 27% మాత్రమే దక్కుతున్నాయని,ఇట్టి రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఐదు శాతం కూడా దాటడం లేదన్నారు.పార్లమెంట్, అసెంబ్లీలలో రిజర్వేషన్లే లేవని,దేశంలో ఐదు శాతం జనాభా లేని అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా 10% మోడీ ప్రభుత్వం దొంగ చాటుగా చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.ఇట్టి రిజర్వేషన్ల వల్ల బిసి నిరుద్యోగులు చాలా అవకాశాలు కోల్పోతున్నారని, సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీ సంఘాలు కోర్టుకు వెళ్లిన సందర్భంలో కచ్చితంగా ఓబీసీ కులాల డేటా ఉండాలని పలుసార్లు తెలిపిందన్నారు.12 వేల కోట్ల బడ్జెట్తో దేశంలో జన గణన చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల కాలం మాత్రమే దరఖాస్తులో చేర్చారు. దేశంలో 60 శాతం ఉన్న బీసీలకు కేంద్ర ప్రభుత్వం 80 లక్షల కోట్ల బడ్జెట్లో 2, వేల కోట్లు కూడా కేటాయించడం లేదు. బిజెపి పార్టీ మొదటి నుంచి బీసీలకు వ్యతిరేకంగానే పనిచేస్తుందన్నారు.దానిలో భాగంగానే ఈరోజు ఓబీసీ కాలం జనగణలో చేర్చడం లేదు. బీసీ విద్యార్థులు, బీసీ కుటుంబాలు బాగుపడాలంటే బిజెపి పార్టీలో నుండి బీసీలు బయటికి రావాలి. రాష్ట్రంలో ఉన్న బిజెపి ఎంపీలు బీసీల మీద ప్రేమ ఉంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ ,ఎంపీ ఈటెల రాజేందర్ వెంటనే రాజీనామా చేయాలని బిఎస్పీ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.లేకపోతే వచ్చే ఎన్నికలలో బీసీలు బిజెపి పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో ఎలగందుల శంకర్, వేల్పుల రాజు, మొగిలిపాక శ్రీనివాస్, మారిశెట్టి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

