ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం లో దండారి (గుస్సాడి) ఉత్సవాల్లో డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ తో కలిసి పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం లో దండారి (గుస్సాడి) ఉత్సవాల్లో డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ తో కలిసి పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని  సుంకిడ గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించిన ఆదివాసీల సాంప్రదాయ దండారి (గుస్సాడి) ఉత్సవాల్లో  డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ తో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి  ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సాంప్రదాయ వాయిద్యాలతో ఆదివాసీలు ఘాన స్వాగతం పలుకగా ఈ వేడుకల్లో గిరిజనులతో కలిసి దండారి వేడుకల్లో నృత్యం చేస్తూ నాయకులు ఉత్సాహంగా మమేకమయ్యారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు ఎంతో గొప్పవని, తరతరాలుగా వస్తున్న ఈ కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి  పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు ఆసిఫ్, సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కంచం లక్ష్మణ్, డీసీసీ ఉపాధ్యక్షులు మాధవ్ పటేల్, డీసీసీ కార్యదర్శి ఇమామ్, గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు తొడసం దౌలత్ రావు, గుడిహత్నూర్ మాజీ మండల అధ్యక్షులు అంకత్ రవి, సుంకిడి సర్పంచ్ రాథోడ్ గణపతి, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు, సిరికొండ ఉప సర్పంచ్ తోకల రాజు, బోరిగాం మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ రెడ్డి, సోంపల్లి సర్పంచ్ లక్ష్మీకాంత్, సుంకిడి ఉప సర్పంచ్ భీంరావు, మార్కెట్ డైరెక్టర్ పురక జగన్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీలత, మాజీ అధ్యక్షులు షేక్ ఇమామ్, కిషన్ పటేల్, కస్బె రామారావు, ఎల్లయ్య, దేవిసెట్, గణపతి, రమేష్, తొడసం భూపతి, జాదవ్ రాదేశ్యం కోవా వసంత్, జైతు, గోవింద్, పూసం సత్యనారాయణ,శామెందర్,ముక్రం,తదితర గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం
కొత్తగూడెం బ్యూరో : డిజిటల్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఇతరులతో పంచుకోవద్దని కొత్తగూడెం సబ్ ఇన్‌స్పెక్టర్ జుబేదా...
దీపావళి వేడుకల్లో తగు జాగ్రత్తలు పాటించాలి: యువత, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలి – పుల్కల్ ఎస్ఐ విశ్వజన్
డీఈవో చేతుల మీదుగా బహుమతులు అందుకున్న సిద్ధార్థ విద్యార్థులు
మోడల్ స్కూల్ లో పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం
మునుగోడులో ఘనంగా సుంకరి బిక్షం గౌడ్ విరమణ వేడుక.
చేగుంట బస్టాండ్ దుస్థితి మార్చే వారే లేరా
ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వెలుగులు నింపాలి