తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం భవన నిర్మాణం కు రూ.5 కోట్లు మంజూరు పట్ల హర్షం
మెదక్ : తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం భవనం నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులు మంజూరు పట్ల రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘానికి 2018 సంవత్సరంలో కోకాపేటలో 2.5 ఎకరాల భూమిని కేటాయించారనీ,
గత ప్రభుత్వం భవన నిర్మాణానికి నిధులు కేటాయించలేదన్నారు. 8 సంవత్సరాలు తాత్సారం జరిగిందనీ,ప్రస్తుత కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణానికి రూ.5 కోట్ల రూపాయలు కేటాయించిన జి.ఓ ను బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి పొన్నం ప్రభాకర్ కు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతుందన్నారు.
దీనితోపాటు, కోకాపేటలోని రెండున్నర ఎకరాల భూమిని పరిశీలించి,ఆ భూమిలో భవన నిర్మాణం తక్షణమే జరిగేలా,అవసరమైన నిధులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
ఈకార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులు వల్లకాటి రాజకుమార్,అప్పం శ్రీనివాస్,గంజి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మేకల జయరాములు,రాజకీయ విభాగం అధ్యక్షులు గుంటి నాగేష్,రాష్ట్ర కార్యదర్శి బొమ్మిడాల లక్ష్మణ్,గ్రేటర్ యూత్ అధ్యక్షులు ఆడెపు సతీష్,కమిటీ సభ్యులు గుండురమేష్,పోల నవీన్ కుమార్,చిలివేరి వీరేశం, మినిగంటి రమేష్, శ్రీనివాస్ హాజరైయ్యారు *చిన్నశంకరంపేట, పాపన్నపేట మండలాల పద్మశాలీల హర్షం** పద్మశాలి సంఘం భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెదక్ నియోజకవర్గ పరిధిలోని చిన్నశంకరంపేట,పాపన్నపేట మండలాల పద్మశాలి సంఘం నాయకులు ఓక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రగడ్డ కిష్టయ్య,చిన్నశంకరం పేట మండల వికలాంగుల సంక్షేమ సంఘం కన్వీనర్ చిప్ప క్రిష్ణ,మండల అధ్యక్షులు తలకొక్కుల శ్రీనివాస్,నాయకులు శివకుమార్,శంకరయ్య, బాల్ రాజ్, పట్టణ అధ్యక్షుడు ఉడుత శ్రీమన్నారాయణ,పాపన్నపేట మండలచేనేత సహకార సంఘం అధ్యక్షుడు కొడపాక విట్టల్,ఉపాధ్యక్షులు పల్లె సంగమేశ్వర,మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు వళ్ళందేశి శ్రీనివాస్,పోల శ్రీనివాస్, తదితరులు హర్షం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


