చండ్రుపల్లిలో డ్రైనేజ్ సమస్యకు చెక్
జయశంకర్ భూపాలపల్లి / మహాదేవపూర్ : మండలం చండ్రుపల్లి గ్రామంలో చాలా కాలంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న డ్రైనేజ్ సమస్యకు గ్రామ సర్పంచ్ గుర్సింగ్ బాపు చొరవతో పరిష్కారం లభించింది.గ్రామంలో మురుగు నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, సమస్యను గుర్తించిన సర్పంచ బాపు స్పందించి జేసీబీ సహాయంతో మురుగు కాలువలను శుభ్రం చేయించి నీటి పారుదలను సక్రమంగా ఏర్పాటు చేశారు.డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించడంతో నిల్వ ఉన్న మురుగు నీరు బయటకు వెళ్లి గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, సమస్యను వెంటనే పరిష్కరించిన సర్పంచ్ గుర్సింగ్ బాపుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవడం అభినందనీయమని పలువురు గ్రామస్థులు పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ ఇలాంటి పనులు కొనసాగించాలని వారు కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


