చేనేత కార్మికులకు రుణమాఫి విముక్తి ఇంకా ఎప్పుడు

చేనేత కార్మికులకు రుణమాఫి విముక్తి ఇంకా ఎప్పుడు

అయిజ / జోగులాంబ గద్వాల :14 నెలల ఐన ఇంకా జమకాని ట్రిఫ్ట్ ఫండ్ రెండున్నర సంవత్సరాలు నుండి కేవలం 3 నెలలు కు మాత్రమే చేనేత బరోసా ఇవ్వడం దారుణం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పంపిన లిఫ్ట్ మిషన్స్ ఇవ్వాకుండా కొందరు ఫ్రాడ్ చేశారు వారిపై చర్య తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణ అధ్యక్షులు తెలుగు నరసింహ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో బిజెపి నాయకులు భగత్ నగర్ లో చేనేత కార్మికుల తీవ్రమైన సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు ఎస్ రామచంద్రారెడ్డి హాజరై మాట్లాడుతూ  జిల్లాలో 7 వేలమంది చేనేత కార్మికులు ఉన్నారని, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన చేనేత రుణమాఫీ ఇప్పటి వరకు అమలు కాలేదని అన్నారు.  అదేవిధంగా త్రిఫ్ట్ ఫండ్ 14 నెలలు గా జమ కావడం లేదని, చేనేత బరోసా కేవలం 3 నెలలు మాత్రమే వచ్చిందని దాని తోపాటు కేంద్ర ప్రభుత్వం పంపిన లిఫ్ట్ మిషన్స్ ఇవ్వకుండా ఫ్రాడ్ చేస్తున్నారని వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పై తెలిపిన సమస్యలు పరిష్కారం కాకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యాక్రమం లో కంపాటి భగత్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్,తూముకుంట అంజి,సిద్దార్థ సార్,బింగిదొడ్డి లక్ష్మణ్,రాజశేఖర్, రఘు, ఖుషీ, సి నరసింహ, వీరరాఘవ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Views: 38

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య
లింగాల గణపురం (జనగామ):  కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం  తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
రూ.35లక్షల అవినీతిపై విచారణ చేయండి
గద్దె రాగడి ఇంట్లో దొంగతనం
శ్రీ కనక దుర్గమ్మ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఆర్టీసీ బస్సు కండక్టర్ నిజాయితీ..!
ప్రమాదవశాత్తూ ఆటోపై నుండి పడి బాలుడు మృతి