అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి : కలెక్టర్

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి : కలెక్టర్

పెద్దపల్లి జిల్లా:అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్, అదనపు కలెక్టర్ బి. శ్రీరాముల తో కలిసి కలెక్టరేట్ సమావేశం మందిరం రూమ్ నెంబర్ 105 లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. గోదావరిఖని కి చెందిన ఎం.శ్రీలత తనకు నర్సింగ్ రంగంలో విద్యా అర్హత అనుభవం ఉన్నాయని, ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ పోస్ట్ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసి తనకు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా వారధి సోసైటీ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జూలపల్లి మండలం కోనరావుపేట గ్రామానికి చెందిన గడ్డం పద్మ, కోట ఉషశ్రీ తమ తల్లి పేరు మీద దూళికట్ట గ్రామ శివారు సర్వేనెంబర్ 591 లో ఉన్న ఎకరం 12 గుంటల భూమి తమ చెల్లెలు తమకు తెలియకుండా విక్రయించిందని ఆ పొలాలను తమ పేరు మీద విరాసత్ కింద చేయాలనే కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన తంగళ్ళ కుమారస్వామి గ్రామపంచాయతీ కార్యాలయం మిగులు పనులు, గ్రామంలో చేసిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు 2023 నుంచి పెండింగ్ ఉన్నాయని, ఆ నిధులు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా పంచాయతీ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన బొడ్డుపల్లి శ్యామల తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పిడి హౌసింగ్ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య
లింగాల గణపురం (జనగామ):  కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం  తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
రూ.35లక్షల అవినీతిపై విచారణ చేయండి
గద్దె రాగడి ఇంట్లో దొంగతనం
శ్రీ కనక దుర్గమ్మ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఆర్టీసీ బస్సు కండక్టర్ నిజాయితీ..!
ప్రమాదవశాత్తూ ఆటోపై నుండి పడి బాలుడు మృతి