కాళేశ్వరం ఎస్టీ కాలనీలో వర్షపు నీటి నిల్వ తొలగింపు పనులు
మహాదేవపూర్ : భారీ వర్షాల కారణంగా కాళేశ్వరం గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీలో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండడంతో స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు చేపట్టడం జరిగింది. గ్రామ సర్పంచ్ వెన్నెపు రెడ్డి మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో కాలువలను శుభ్రపరిచి, నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న మట్టి, చెత్తను తొలగించి వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెన్నెపు రెడ్డి మోహన్ రెడ్డి , వార్డు సభ్యులు శ్రీ సయ్యద్ ఇమ్రాన్ మరియు ఎస్టీ కాలనీ వాసులు పాల్గొని పనులను పర్యవేక్షించారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
