ఘనంగా ముర్షద్ దర్గా ఉర్సు ఉత్సవాలు.
ఉత్సవాల్లో పాల్గొన్న ఆర్బిఓఎల్ సీఈఓ శ్రీనివాసరెడ్డి.
తాండూరు (వికారాబాద్ జిల్లా) తాండూర్ పట్టణంలోని ముర్షద్ దర్గా ఉత్సవాలు ఘనంగా ప్రారంభ మయ్యాయి. పవిత్ర ఉర్సు ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్బిఎల్ సీఈవో బుయ్యాని శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు, ప్రజాప్రతినిధులతో కలిసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని దర్గాకు పులు చాదర్ సమర్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ శాంతి, సౌభ్రాతృత్వం, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించిన ఈ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొని దర్గా నిర్వాహకులు, ముస్లిం పెద్దలతో ఆత్మీయంగా ముచ్చటించారు. "మతాలు వేర్వేరు అయినా మనందరం ఒక్కటే. సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత బలపడాలి పేర్కొన్నారు. ఉత్సవాలలో ముర్ష దర్గా నిర్వాకులు పలువురు నాయకులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
12 Aug 2026 16:40:04
శివ్వంపేట (మెదక్): శివంపేట మండల పరిధిలోని పెద్దగొట్టిముక్ల ZPHS పాఠశాలలో బుధవారం విద్యార్థుల్లో చదువుతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించే...
