సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి:ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిస్
ముథోల్:గ్రామాల్లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ అన్నారు. మంగళవారం మండలంలోని బోరిగాం గ్రామంలో సీసీ కెమెరాల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ .. గంజాయి, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల దూరంగా ఉండాలన్నారు. ఎవరైనా గంజాయిని విక్రయించిన, కొనుగోలు చేసిన పోలీసులకు సమాచారం అందజేయాలన్నారు. గ్రామాల్లో ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాల నియంత్రించి, నేరస్తులను త్వరగా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్లెడ కిష్టయ్య,మాజీ సర్పంచ్ మురళీ, నాయకులు, గ్రామస్తులు, పాల్గొన్నారు.
Views: 244
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
