గ్రామసభ నిర్వహించాలని అధికారులకు వినతి

గ్రామసభ నిర్వహించాలని అధికారులకు వినతి

 సిర్గాపూర్: గ్రామంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెంటనే గ్రామసభ నిర్వహించాలని కోరుతూ సిర్గాపూర్ గ్రామస్థులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. గ్రామపంచాయతీలో ఇప్పటివరకు గ్రామసభ నిర్వహించలేదని, ప్రజల సమస్యలను చర్చించి పరిష్కరించేందుకు గ్రామసభ ఏర్పాటు చేయాలని వారు కోరారు.ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి నరసింహ గౌడ్, తహసీల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌కు వినతిపత్రాలు అందజేశారు. తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు తదితర సమస్యలపై గ్రామసభలో చర్చించి పరిష్కార చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరారు.వెంటనే గ్రామసభ తేదీ ప్రకటించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేశారు.

Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాలి
ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన కార్యక్రమం
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి..
భారీ వర్షాలతో ఉట్నూర్–మత్తడిగూడ వాగుపై రాకపోకలు నిలిచివేత
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గోలి సంతోష్
చక్రియాల గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవాలు