ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని నవజాత శిశువుల వార్డులో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం రిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. అగ్ని ప్రమాదం అనంతరం చేపట్టిన సహాయక చర్యల ను మంత్రి పరిశీలించారు. నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.మరణించిన చిన్నారుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఏ ఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి,వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, వైద్య సిబ్బంది,,తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


