తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు జాతీయ స్థాయి గుర్తింపు
ఉత్తమ యాంటీ-నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ అవార్డు అందుకున్న డైరెక్టర్ సందీప్ శాండిల్యా
న్యూఢిల్లీ: తెలంగాణలో మాదకద్రవ్యాల నియంత్రణ, అక్రమ రవాణా నిరోధం, యువతలో డ్రగ్స్‌పై అవగాహన కల్పించడంలో కీలకం గా పనిచేస్తున్న తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. తెలంగాణ ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా, న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారతదేశంలో ఉత్తమ యాంటీ-నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ అవార్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా అందుకున్నారు. తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలు, సమన్వయంతో కూడిన అమలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలకు ఈ గుర్తింపు లభించినట్లు పేర్కొన్నారు. ఈ అవార్డు తెలంగాణ పోలీసు శాఖతో పాటు ఈగల్ ఫోర్స్ అధికారులు, సిబ్బందికి గర్వకారణమని పలువురు అభినందనలు తెలిపారు. మాదకద్రవ్యాల రహిత తెలంగాణ లక్ష్యంతో మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఈ జాతీయ పురస్కారం ప్రోత్సాహాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సందీప్ శాండిల్యా,కు అధికారులు, పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల వారు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

