ఖానాపూర్ శివారులో అగ్నిప్రమాదం.. స్పందించిన అగ్నిమాపక శాఖ
నిజామాబాద్ : నిజామాబాద్ రూరల్ నగర శివారులోని ఖానాపూర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు అగ్నిమాపక శాఖ అధికారులు సమాచారం అందించారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద గడ్డికి నిప్పు.. అగ్నిమాపక శాఖ అధికారి శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ శివారులోని భీమేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ వెనక భాగంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద గడ్డికి నిప్పంటుకుంది. దీంతో సమాచారం అందుకున్న శాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. సరైన సమయంలో ఫైర్‌స్టేషన్ సిబ్బంది స్పందించడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. సంఘటనాస్థలం వద్ద ఎస్ఎఫ్వో శంకర్, లీడింగ్ ఫైర్‌ఫైటర్ ఏసురత్నం, ఫైర్‌ఫైటర్లు శీను, హరి, బస్వరాజు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


