కాంటా కాటేసింది..!
జగిత్యాల : జగిత్యాల జిల్లా రాజరాంపల్లెలో విషాదం చోటు చేసుకుంది..!
ఎలక్ట్రిక్ కాంటా చార్జింగ్ లో ఉన్న సమయంలో ముట్టుకోవడంతో విద్యుత్ షాక్ తో విలవిలలాడి పది నెలల పసి పాప మృతి చెందినది..! చార్జింగ్ పెట్టిన తల్లిదండ్రులు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా.. పాప పాకుతూ వెళ్లి కాంటా పట్టుకున్నట్లు సమాచారం..!
ఏది ఏమైనా ఇదొక దారుణం.. చిన్న నిర్లక్ష్యం వల్ల తాము బిడ్డను కోల్పోయామని తల్లి తల్లడిల్లిపోయింది..!
మారుతున్న జీవన పరిస్థితుల్లో పనిముట్లు.. వృత్తిపరమైన పరికరాలు అన్ని ఎలక్ట్రానిక్ రూపంలోకి మారిపోతున్నాయి...
సులువైన వాడకం కోసం ఎలక్ట్రానిక్ వస్తువులు పనిముట్లు వాడుతున్నాం...
కానీ అవి ఎంతటి ప్రాణాంతకమో.. వాటివల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయో మెల్లి మెల్లిగా అర్థమవుతుంది..!
సాధ్యమైనంత వరకు ఇళ్లలో.. పిల్లలు ఉన్నచోట ఎలక్ట్రిక్ వస్తువులు పనిముట్లు అత్యంత జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరముంది..!
లేదంటే చిన్న నిర్లక్ష్యానికి పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది..!
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


