అల్లాదుర్గం మండల స్థాయి క్విజ్ పోటీల నిర్వహణ
2026మండల స్థాయి క్విజ్ పోటీల్లో ముస్లాపూర్ విద్యార్థుల విజయదుందుభి
అందోల్, : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో “మెదక్ జీనియస్ క్వెస్ట్ – 2026” మండల స్థాయి క్విజ్ పోటీలను ఎంఈఓ శ్రీ లక్ష్మణ్ అధ్యక్షతన, క్విజ్ ఇన్‌చార్జి, గడిపెద్దాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింహులు సమక్షంలో నిర్వహించారు.ఈ పోటీల్లో మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దాపూర్, ముస్లాపూర్, చిల్వేర్, కేజీబీవీ బాలికల పాఠశాల,జిల్లా పరిషత్ ఉన్నత బాలుర,బాలికల ఉన్నత పాఠశాలలకు చెందిన మొత్తం ఆరు పాఠశాలల నుంచి 18 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి పాఠశాల నుంచి 8, 9, 10వ తరగతులకు చెందిన ఒక్కొక్క విద్యార్థిని పాఠశాల స్థాయిలో ఎంపిక చేసి మండల స్థాయి పోటీలకు నామినేట్ చేశారు. 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు వేర్వేరు విభాగాల్లో నిర్వహించిన క్విజ్ పోటీల్లో ZPHS ముస్లాపూర్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి మూడు విభాగాల్లోనూ ప్రథమ స్థానాలను కైవసం చేసుకున్నారు. విజేత విద్యార్థులు:
- 10వ తరగతి – పి. పూజాశ్రీ
- 9వ తరగతి – కార్తిక్
- 8వ తరగతి – వైష్ణవి
విజేతలకు ప్రశంసాపత్రాలతో పాటు షీల్డులను అందజేశారు. వీరు త్వరలో నిర్వహించనున్న జిల్లా స్థాయి క్విజ్ పోటీల్లో పాల్గొననున్నారు.ఈకార్యక్రమంలో అల్లాదుర్గం కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీ పిచ్చయ్య, క్విజ్ మాస్టర్లు నర్సింహులు, సత్యనారాయణ, కృష్ణ, టెక్నికల్ పర్సన్లు జనార్దన్, వీరప్ప, గోవిందలీల, చిల్వేర్ హెచ్ఎం సవిత, ముస్లాపూర్ హెచ్ఎం సంజీవయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాస్, శ్రీకాంత్, మచ్చేందర్, స్వప్న, పాండురంగం,వేణుమాధవరెడ్డి,ప్రతిభ,ఫరీదా తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

