రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపిక

ఉమ్మడి మెదక్ జిల్లా SGF అండర్-14, అండర్-17 పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపిక

చౌటకూర్ :  చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు.ఈ నెల 19న మెదక్‌లో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా SGF అండర్-14, అండర్-17 కబడ్డీ పోటీల్లో పాఠశాలకు చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.అండర్-14 విభాగంలో ఉమేష్, శ్రీను, చైనా, రాహుల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.అండర్-17 విభాగంలో వినోద్, మహేష్, దివిదాస్, రాహుల్ ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొననున్నారు.విద్యార్థుల విజయంపై పాఠశాల హెచ్‌డబ్ల్యూఓ భవాని అభినందనలు తెలిపారు. పీటీ దేవసోత్, సోనేష్ నాయక్ కూడా విద్యార్థులను అభినందించారు. అదేవిధంగా లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ నాయక్, జిల్లా కార్యదర్శి మహేష్ రాథోడ్, చిరంజీవి, నరేష్ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపిక రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపిక
చౌటకూర్ :  చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు.ఈ నెల 19న మెదక్‌లో నిర్వహించిన...
అల్లాదుర్గం మండల స్థాయి క్విజ్ పోటీల నిర్వహణ
ప్రతి కుటుంబానికి రూ5 లక్షల భీమా పథకం
తాడిడాన్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై గ్రామసభ
మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చేతుల మీదుగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ఇందిరా గాంధీకి ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ కొండ రాజమ్మ
కారుపాకల కొమురయ్య మృతికి సర్పంచ్ బండి స్వామి సంతాపం