జలసిరి ప్రత్యేక గ్రామసభలో భూగర్భ జలాల పెంపుపై అవగాహన
- ఇంటికి ఒక ఇంకుడు గుంత..
- పొలానికి ఒక పంట కుంట నిర్మించుకోవాలి:
- ఎంపీడీవో కే.శంకర్
చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 'జలసిరి' ప్రత్యేక గ్రామసభను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షపు నీటిని ఒడిసిపట్టి, భూగర్భ జలాలను పెంపొందిం చేందుకు చేపట్టాల్సిన చర్యలపై గ్రామస్తులకు విస్తృత అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో కే.శంకర్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున, పడిన ప్రతి వర్షపు చుక్కనూ వృథా చేయకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి సంరక్షణ ద్వారానే భవిష్యత్తులో భూగర్భ జలాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత, ప్రతి పంట పొలానికి ఒక పంట కుంట (ఫార్మ్ పాండ్) తప్పనిసరిగా నిర్మించుకోవాల ని ఆయన కోరారు. వర్షపు నీటిని భూమిలోకి మళ్లించడం వల్ల నీటి కొరతను అధిగమించవచ్చని వివరించారు. గ్రామ ప్రజలందరూ ప్రభుత్వ సూచనలను పాటించి నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ పి.సువర్ణ, శివంపేట గ్రామ సర్పంచ్ సంధ్య మల్లికార్జున్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నత్తి దశరథ్, ఉపసర్పంచ్ సందీప్, పంచా యతీ కార్యదర్శి వేణుగోపాల్, ఫీల్డ్ అసిస్టెంట్ నిర్మల, మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Views: 52
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
30 Jul 2026 19:28:17
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
