మల్యాలను ముంచెత్తిన భారీ వర్షం
- నిండు కుండలా మారిన చెరువులు, కుంటలు!
- కొండగట్టు రహదారిపై విరిగిపడిన భారీ వృక్షం:
- నిలిచిపోయిన రాకపోకలు!
మల్యాల,: జగిత్యాల జిల్లా మల్యాల మండల వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈదురుగాలుల తో కూడిన భారీ వర్షాలకు జలకళ సంతరించుకుంది. వర్షాల ధాటికి మండలంలోని చెరువులు, కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ప్రాజెక్టులు, జలాశయాల్లో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. కొండగట్టు రహదారి పక్కన విరిగిపడిన భారీ చెట్టు భారీ వర్షాలు మరియు ఈదురుగాలుల ప్రభావంతో కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిపై మెహర్ బాబా గుడి దగ్గర ఉన్న ఒక పెద్ద వృక్షం మొదళ్లతో సహా విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డుకు అడ్డంగా చెట్టు పడిపోవడంతో కాసేపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై పడిన చెట్టు కొమ్మలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. పంట పొలాలకు జీవం.. ఆనందంలో రైతన్నలు గత కొన్ని రోజులుగా వర్షాలు లేక ఆందోళన చెందుతున్న రైతులకు ఈ రెండ్రోజుల వర్షం కొండంత ఊరటనిచ్చింది. ఎండిపోతున్న పంట పొలాలకు ఈ వర్షపు నీరు ప్రాణం పోసినట్లయింది. వరి నాట్లు వేసేందుకు మరియు ఇతర సాగు పనులను వేగవంతం చేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పంట పొలాలు పచ్చదనంతో నిండిపోయి కంటికి విందునిస్తున్నాయి. ప్రజలు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి: అధికారులు వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మండల ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రయాణాలు చేసేటప్పుడు చెట్ల కింద నిలబడవద్దని, వాగులు, వంకలు దాటేటప్పుడు జాగ్రత్త వహించాలని కోరారు. చెరువులు, కుంటల వద్దకు పిల్లలను వెళ్లనీయవద్దని హెచ్చరించారు.
Views: 46
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
30 Jul 2026 19:28:17
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
