ఆర్వోబీ నిర్మాణంలో జాప్యంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అసంతృప్తి

ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవా అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం

ఆర్వోబీ నిర్మాణంలో జాప్యంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అసంతృప్తి

కరీంనగర్, :కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణ పనుల్లో జాప్యం, రాకపోకలకు ప్రజలు పడుతున్న ఇబ్బందులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్వోబీ సమీపంలోని కల్వర్టులో వృద్ధురాలు పడిపోయిన ఘటనపై సమాచారం అందడంతో బండి సంజయ్ ఆర్ అండ్ బి అధికారులు, కాంట్రాక్టర్లపై అసహనం వ్యక్తం చేశారు. ఆర్వోబీ నిర్మాణ సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారుఈ సందర్భంగా ఆర్ అండ్ బి అధికారులు, కాంట్రాక్టర్ మాట్లాడుతూ తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణానికి సంబంధించి భూసేకరణలో తీవ్ర జాప్యం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం భూసేకరణ చేయలేదని, ప్రస్తుత ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టిందని, త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.ఆర్వోబీ నిర్మాణ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా బీటీ రోడ్డు, కల్వర్టు నిర్మాణం చేయాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధులు విడుదల చేయకపోవడంతో ఆయా పనులు ఆగిపోయాయని వివరించారుఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ న్యూఢిల్లీ నుంచి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ సునీల్ తో ఫోన్‌లో మాట్లాడారు. తీగలగుట్టపల్లి ఆర్వోబీ వద్ద బీటీ రోడ్డు, కల్వర్టు నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారుకేంద్ర మంత్రి ఆదేశాల మేరకు మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ హుటాహుటిన తీగలగుట్టపల్లి ఆర్వోబీ వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఆర్వోబీ సమీపంలోని కల్వర్టును, రాకపోకలకు జరుగుతున్న ఇబ్బందులను గమనించారు.బీటీ రోడ్డు, కల్వర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వనందున, మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని తెలిపారు. భూసే కరణలోగత ప్రభుత్వం జాప్యం చేయడంతో పనులు ఆలస్యమయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం భూసేకరణకు సిద్ధమైం దని, త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు. రాబోయే 6 నెలల్లో ఆర్వోబీ నిర్మాణంలో ఒకవైపు పనులను పూర్తి చేస్తామని, వచ్చే ఏడాది వరకు గడువు ఉన్నందున రెండువైపులా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.
 
1004671202
 
 
Views: 20

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాలి
ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన కార్యక్రమం
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి..
భారీ వర్షాలతో ఉట్నూర్–మత్తడిగూడ వాగుపై రాకపోకలు నిలిచివేత
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గోలి సంతోష్
చక్రియాల గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవాలు