ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్

ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ  మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

గజ్వేల్ :  గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి సోమవారం రోజు స్థానిక అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. వార్డులోని పలు వీధుల్లో కాలినడకన తిరుగుతూ ప్రజల సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డులోని రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా మరియు వీధి దీపాల స్థితిగతులను అధికారులతో కలిసి నిశితంగా తనిఖీ చేశారు. పారిశుద్ధ్య లోపాలు తలెత్తకుండా చూడాలని, తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా క్రమబద్ధీకరించాలని సూచించారు. డ్రైనేజీ కాల్వల్లో పూడికతీత పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు, రహదారుల మరమ్మతులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని సంబంధిత శాఖాధికారులను మున్సిపల్ చైర్‌పర్సన్ అదేశించారు. స్థానిక ప్రజలతో ముఖాముఖి మాట్లాడి, వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే మున్సిపాలిటీ ముఖ్య లక్ష్యం అని, 4వ వార్డు సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని పనులను ప్రాధాన్యత ప్రాతిపదికన చేపట్టి, త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్ కార్ పద్మాబాయి నర్సింగరావు, కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, మామిడి శ్రీధర్, మున్సిపల్ అధికారులు, వార్డు ప్రజలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
సింగరేణిలో హౌసింగ్ పీడీ పర్యటన
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
వర్షానికి రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.
కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ అమలుపై రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ శిక్షణ