మర్రిగూడ శ్రీ సాయి వైన్స్ లో నకిలీ మద్యం విక్రయాల ఆరోపణలు

మర్రిగూడ శ్రీ సాయి వైన్స్ లో నకిలీ మద్యం విక్రయాల ఆరోపణలు

  • నాణ్యతపై అనుమానాలతో మద్యం ప్రియులు..
  • ఎక్సైజ్ అధికారుల ఆకస్మిక తనిఖీలకు డిమాండ్

నల్గొండ/మర్రిగూడ:నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలోని 'శ్రీ సాయి వైన్స్' లో నకిలీ మద్యం విక్రయిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.విక్రయిస్తున్న మద్యం నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో మద్యం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. మర్రిగూడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు శ్రీ సాయి వైన్స్‌లో 'బ్లెండర్స్ ప్రైడ్' క్వార్టర్ బాటిల్‌ను కొనుగోలు చేశారు.అయితే, ఆ మద్యాన్ని సేవించిన తర్వాత దాని రుచిలో తేడా ఉండటంతో పాటు శారీరకంగా పలు ఇబ్బందులు తలెత్తినట్లు వారు పేర్కొంటున్నారు. అనుమానం వచ్చి బాటిల్‌ను పరిశీలించగా,దాని నాణ్యత సరిగ్గా లేదని గ్రహించారు.ఆగ్రహించిన బాధితులు వైన్స్ దుకాణం సమీపంలోనే ఆ బాటిళ్లను వేసి కొద్దిసేపు నిరసన కూడా తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన సమాచారం మండలం మొత్తం వ్యాపించడంతో,ఆ వైన్స్‌లో అసలు ఏం జరుగుతుందనే చర్చ జోరుగా సాగుతోంది?
ఎక్సైజ్ శాఖ అధికారుల జోక్యానికి డిమాండ్!
విక్రయిస్తున్న మద్యం నిజంగానే నకిలీదా? లేక నాణ్యతలో లోపమా? లేదా కేవలం వినియోగదారుల అనుమానమా? అనేది అధికారిక పరీక్షల ద్వారానే తేలాల్సి ఉంది? మద్యం బాటిళ్ల సీల్స్, బ్యాచ్ నెంబర్లు, హోలోగ్రామ్ లేబుల్స్, స్టాక్ రిజిస్టర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పదంగా ఉన్న మద్యం శాంపిళ్లను ప్రభుత్వ ప్రయోగశాలకు పంపి నాణ్యతను నిర్ధారించాలని,నిబంధనలకు విరుద్ధంగా నకిలీ,కల్తీ మద్యం విక్రయిస్తున్నట్లు తేలితే సంబంధిత యాజమాన్యంపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఎక్సైజ్ అధికారులు తక్షణమే స్పందించి శ్రీ సాయి వైన్స్‌లో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
నాంపల్లి ఎక్సైజ్ సీఐ వివరణ
ఈ విషయంపై నాంపల్లి ఎక్సైజ్ సీఐ ని వివరణ కోరగా ఈ ఘటనకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు మా దృష్టికి రాలేదు. బాధితుల దగ్గర కనుక ఆ అనుమానాస్పద బాటిల్స్ ఉంటే మా ఆఫీస్‌లో అందజేయాలి.వాటిని వెంటనే తనిఖీల నిమిత్తం ప్రభుత్వ ల్యాబ్‌కు పంపి నిజానిర్ధారణ చేస్తాం. త్వరలోనే సంబంధిత వైన్స్ షాప్‌ను తనిఖీ చేసి, విచారణలో నకిలీ మద్యం విక్రయాలు రుజువైతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు.ఈ నకిలీ మద్యం విక్రయాల ఆరోపణల్లో వాస్తవమెంత ఉందనేది ఎక్సైజ్ అధికారుల సమగ్ర విచారణ మరియు నాణ్యత పరీక్షల తర్వాతే స్పష్టమవుతుంది.ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి ఘటనలపై అధికారులు తక్షణమే స్పందించి,వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

Views: 195

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం
హైదరాబాద్ : బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న *“ఇంటింటా ఇందిరమ్మ కుట్టు...
సెప్టెంబర్ 17 న హైదరాబాద్ లో టి. ఆర్.పి పాదయాత్ర
బాలాపూర్ లో స్పీకర్ గడ్డ ప్రసాద్ కు ఘన స్వాగతం
ప్రధాని మోదీ పుట్టినరోజున ప్రతి ఇంట దీపం వెలిగించాలి
సీఎం రేవంత్ రెడ్డి తో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంధనవాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ భేటీ.. 
సెప్టెంబర్‌ 17పై సమరశంఖం!
చాంద టి నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్