శివంపేటలో రైస్‌ మిల్లులో విజిలెన్స్‌ తనిఖీలు

శివంపేటలో రైస్‌ మిల్లులో విజిలెన్స్‌ తనిఖీలు

శివంపేట, (మెదక్): శివంపేట మండలంలోని రైస్‌ మిల్లుల్లో విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం మండలంలోని గూడూరు గ్రామంలో ఉన్న ఓం సాయి వెంకటరమణ రైస్‌ మిల్లులో విలెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం, మిల్లుల నుంచి ప్రభుత్వానికి అందించిన బియ్యం, ప్రస్తుతం మిల్లులో ఉన్న ధాన్యం నిల్వల వివరాల ను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ధాన్యం నిల్వలు, రికార్డులను తనిఖీ చేస్తూ వివరాలను నమోదు చేసుకున్నారు. రైస్‌ మిల్లుల్లో విజిలెన్స్‌ తనిఖీలు కొనసాగుతుండటంతో మిల్లర్లలో ఆందోళన నెలకొంది. అధికారుల తనిఖీలతో ధాన్యం నిల్వలు, ప్రభుత్వానికి అందించిన బియ్యం వివరాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం
హైదరాబాద్ : బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న *“ఇంటింటా ఇందిరమ్మ కుట్టు...
సెప్టెంబర్ 17 న హైదరాబాద్ లో టి. ఆర్.పి పాదయాత్ర
బాలాపూర్ లో స్పీకర్ గడ్డ ప్రసాద్ కు ఘన స్వాగతం
ప్రధాని మోదీ పుట్టినరోజున ప్రతి ఇంట దీపం వెలిగించాలి
సీఎం రేవంత్ రెడ్డి తో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంధనవాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ భేటీ.. 
సెప్టెంబర్‌ 17పై సమరశంఖం!
చాంద టి నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్