డా. ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతి ఘనంగా నిర్వహణ

యువత ఆదర్శంగా తీసుకోవాలి - మహమ్మద్ అమీర్

 డా. ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతి ఘనంగా నిర్వహణ

కరీంనగర్ : భారతరత్న, మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డా. ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతిని ప్రజా ప్రయోజనాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని అంబేద్కర్ నగర్‌లోని వారి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారుఈ సందర్భంగా ప్రజా ప్రయోజనాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ఆమీర్ మాట్లాడుతూ, అబ్దుల్ కలాం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థలలో సేవలందించి శాస్త్రవేత్తగాభారత క్షిపణి పురుషుడుగా యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. రాష్ట్రపతిగా ప్రజల రాష్ట్రపతిగా అందరి అభిమానం చూరగొన్నారని కొనియాడారు. నేటి యువత, విద్యార్థులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారుకలాం భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి ఆశయాలు, లక్ష్యాల సాధనకు కృషి చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో 27వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల శ్యామల - కిరణ్ కుమార్, పిల్లి లక్ష్మణ్, తుమ్ నారాయణ, అబ్దుల్ రెహమాన్, సాగర్, మేరాజ్, రమేష్, ప్రవీణ్, రాజశేఖర్, అక్బర్, ఎస్దాని, మల్లికార్జున్, వెంకటేష్, అక్షయ్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు
Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News