రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ ది సువర్ణాధ్యాయం
హన్మకొండ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జయశంకర్ సార్ ది సువర్ణ అధ్యాయం అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొనియాడినారు.ఆగస్టు 6 జయశంకర్ సార్ జయంతి కార్యక్రమం సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగే ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీ కి సంబంధించిన పోస్టర్ ని హైదరాబాద్ లో తన కార్యాలయంలో ఆవిష్కరించిన సందర్భంగా ఎమ్మెల్సీ మల్లన్న మాట్లాడుతూ జయశంకర్ సార్ విద్యార్థి దశ నుండి తెలంగాణ సిద్ధాంతకర్త వరకు తన ఉద్యమ జీవిత చరిత్రను ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీ ద్వారా ప్రదర్శించటం భావితరాలకు, యువతకి, విద్యార్థులకి తెలంగాణ ఉద్యమ చరిత్రను, రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాన్ని పరిచయం చేయటమే అని అభిప్రాయపడినారు.జయశంకర్ సార్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకి ఒక బలమైన సైదాంతిక పునాదిని నిర్మించటం వలనే రాష్ట్రం సాధించగలిగామని అభిప్రాయపడినారు.కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరై జయశంకర్ సార్ కి నివాళి అర్పిస్తానని తెలియజేసినారు.ప్రొఫెసర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ జయశంకర్ సార్ సహచరులుగా రాష్ట్ర సాధన కోసం అతను చేసిన కృషిని మరొకసారి గుర్తు చేసుకోవటానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ పార్టీలకి, సంఘాలకు చెందిన వారు హాజరుకావాలని విజ్ఞప్తి చేసినారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ కొనతం కృష్ణ డాక్టర్ తిరునహరి శేషు డాక్టర్ రమేష్, చిన్నాల యశ్వంత్ యాదవ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఓదెల యాదవ్ డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
