రాజాపూర్‌లో గణేష్ ఉత్సవ కమిటీలకు పోలీసుల కఠిన మార్గదర్శకాలు

-- ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలి: సీఐ కే. మహేష్, ఎస్సై ఎన్. రాజశేఖర్

రాజాపూర్‌లో గణేష్ ఉత్సవ కమిటీలకు పోలీసుల కఠిన మార్గదర్శకాలు



రాజాపూర్ మండలంలోని వివిధ గ్రామాలలో గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జడ్చర్ల గ్రామీణ సిఐ మహేష్, రాజాపూర్ ఎస్సై రాజశేఖర్   ఉత్సవ కమిటీలకు సూచించారు. రాజాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గణేష్ ఉత్సవాల నిర్వహణ పై ఉత్సవ కమిటీ సభ్యులతో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండపాల ఏర్పాటుతో పాటు నిమజ్జన ఊరేగింపులో నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాల్సిన నియమ నిబంధనలను పోలీసులు వివరించారు.మండపాల వద్ద భద్రతా చర్యలువిగ్రహాల ఏర్పాటుకు ముందుగానే పోలీస్ శాఖకు సమాచారం అందించి, అధికారిక పోలీస్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.మండపాల వద్ద 24 గంటల భద్రత ఉండేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు, అత్యవసర లైట్లు, క్యూ బ్యారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.విద్యుత్ వైరింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని, షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. మండపం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రమాదకర వస్తువులు, రాళ్లు, కర్రలు, చెత్తకుప్పలు లేకుండా చూడాలని తెలిపారు.డీజేలు, లౌడ్‌స్పీకర్లపై నిబంధనలు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా డీజేలు వినియోగించరాదని పోలీసులు స్పష్టం చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌స్పీకర్ల వినియోగం చేయరాదని తెలిపారు.శబ్ద కాలుష్యం వల్ల విద్యార్థులు, వృద్ధులు, ఆస్పత్రులు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు ఇబ్బందులు కలగకుండా శబ్ద పరిమితులను పాటించాలని నిర్వాహకులకు సూచించారు.నిమజ్జన ఊరేగింపులో నిబంధనలు నిమజ్జనం కోసం అవసరమైన వాహనాలను నిర్వాహకులే ముందుగా ఏర్పాటు చేసుకోవాలని, ఒక విగ్రహానికి ఒక వాహనం మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. నిమజ్జనం రోజున పోలీసుల సూచనల మేరకు వాహనాలు బయలుదేరాలని, పోలీసులు కేటాయించిన ప్రత్యేక నంబర్‌ను వాహనంపై స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు.విగ్రహాలను తరలించే వాహనాలపై లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేయరాదని, మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్న వ్యక్తులను ఊరేగింపులోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు నిమజ్జన ఊరేగింపులో కత్తులు, బాకులు, తుపాకులు తదితర మారణాయుధాలను తీసుకెళ్లరాదని పోలీసులు హెచ్చరించారు. కర్రలు ఉపయోగించే వారు నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. రాజకీయంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, ఇతరులకు ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడడం వంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.అదేవిధంగా విద్యుత్ తీగలు, హైటెన్షన్ లైన్లు ఉన్న ప్రాంతాల్లో విగ్రహాలను తరలించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, పోలీస్ కంట్రోల్ రూమ్: 8712659360, ఎమర్జెన్సీ నంబర్: 112కు ఫోన్ చేయాలని సీఐ కే. మహేష్, ఎస్సై ఎన్. రాజశేఖర్ ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించి పోలీస్ శాఖకు సహకరించాలని వారు కోరారు.

Views: 88

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget