దండారి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్లే రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు
ఆదిలాబాద్ బ్యూరో : జిల్లా సాత్నాల మండలం లోని జమిని గ్రామంలో నిర్వహించిన ఆదివాసీల సంప్రదాయ పండుగైన దండారి ఉత్సవాల్లో మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్లే రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు పాల్గొన్నారు.ముందుగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.కళాకారులు సంప్రదాయ వేషధారణలో చేసిన నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మన ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపునిస్తాయని పేర్కొన్నారు. అలాగే ప్రతి దండారి లకు షెడ్డు నిర్మించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని దానిని కూడా సాధిస్తామని హామీ ఇచ్చారు.*
*ఈ కార్యక్రమంలో తొమ్మిది తెగల ఆదివాసీ జే ఏ సీ చేర్మెన్ చుంచు రామకృష్ణ దొర,అడప కోశేరావు, తానాజీ, పురుషోత్తం, మోహన్ రావు, కనక తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు*
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


