ఆదిలాబాద్ కుఎన్ఎంసీ నుంచి అదనంగా 21 పీజీ వైద్య సీట్లు మంజూరు... కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో మొత్తం 90కి చేరిన పీజీ సీట్లు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తాజాగా అదనంగా 21 పీజీ వైద్య సీట్లు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ వైద్య విభాగాల్లో కొత్తగా సీట్లు మంజూరు కావడంతో కళాశాలలో పీజీ వైద్య సీట్ల సంఖ్య మొత్తం 90కి చేరిందని వెల్లడించారు. ఈ అదనపు సీట్ల మంజూరు జిల్లాలో వైద్య విద్య అభివృద్ధికి, నిపుణులైన వైద్యుల తయారీకి మరింత దోహదపడుతుందని పేర్కొన్నారు. విభాగాల వారీగా మంజూరైన అదనపు పీజీ సీట్లు:
- పీడియాట్రిక్స్ – 4
- సైకియాట్రీ – 3
- రేడియాలజీ – 2
- ప్రసూతి, స్త్రీ వైద్య విభాగం – 4
- ఆర్థోపెడిక్స్ – 2
- ఈఎన్టీ – 6
ప్రభుత్వ వైద్య కళాశాల అభివృద్ధికి, పీజీ సీట్ల మంజూరుకు కృషి చేసిన వైద్య కళాశాల అధికారులు, వైద్యులు, సంబంధిత శాఖల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ అభినందించారు. భవిష్యత్తులోనూ వైద్య విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


