ఇందుర్తి గ్రామానికి వైకుంఠ రథం బహుకరణ

ఇందుర్తి గ్రామానికి వైకుంఠ రథం బహుకరణ

చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామ పంచాయతీకి అరుదైన, ఆదర్శనీయమైన సేవ లభించింది. గ్రామానికి చెందిన  దాతలు రాగి నాగరాజు - సరిత దంపతులు తమ తల్లిదండ్రులు కేతమ్మ -  మల్లయ్య  జ్ఞాపకార్థం గ్రామ ప్రజల సౌకర్యార్థం 2.80 లక్షల విలువగల ఒక 'వైకుంఠ రథం' (అంతిమ యాత్రా వాహనం)ను బహుకరించారు.ఈ సందర్భంగా గ్రామంలో ఎవరైనా మరణిస్తే, వారి అంతిమ సంస్కారాల నిమిత్తం పార్థివ దేహాన్ని శ్మశాన వాటికకు గౌరవప్రదంగా తరలించేందుకు ఈ రథం ఎంతో ఉపయోగపడనుంది. అంతేకాకుండా, దాతల గొప్ప మనసును చాటుకుంటూ... గ్రామంలో ఏ కుటుంబంలోనైనా మరణం సంభవిస్తే, ఆ అంతిమ యాత్ర రవాణా ఖర్చుల నిమిత్తం డీజిల్ కోసం రూ. 500/- నగదును కూడా తామే స్వయంగా అందజేస్తామని నాగరాజు - సరిత దంపతులు ప్రకటించారు. వారి ఈ ఉదార స్వభావాన్ని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు హృదయపూర్వకంగా అభినందించారు.సమాజానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయమని, కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు ఇది కొండంత భరోసానిస్తుందని గ్రామ ప్రముఖులు కొనియాడారు. ఈ సందర్భంగా రాగి నాగరాజు - సరిత దంపతులను మరియు వారి కుటుంబ సభ్యులను శాలువాలతో సన్మానించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాగి నాగరాజు మాట్లాడుతూ పుట్టిన ఊరు కన్నతల్లితో సమానం ఊరికి సేవచేయాలనే ఆలోచనతో ఈ వైకుంఠ రథాన్ని అందజేయడం జరిగిందని గతంలో కూడా మసీదు కు గ్రిల్స్ కొరకు 35 వెలారుపాయలు ఇవ్వడం జరిగిందని అలాగే ఒకటవ వార్డులో తన ఇంటి ఆవరణలోని ఒక గుంట స్థలాన్ని మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి ఇచ్చానని రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధికి తనకు తోచిన ఆర్థిక సహాయం అందజేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ చింతపూల నరేందర్ ఉపసర్పంచ్ చింతపూల అనిల్,సింగిల్ విండో డైరెక్టర్లు చింతపూల సాయన్న, చిట్యాల బల్ రెడ్డి, కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షుడు అందే సురేష్, వార్డు సభ్యులు తోట లావణ్య,గట్టు లక్ష్మీ,అందే బాబు,మాజీ సర్పంచ్ పుల్లూరి రాజు,మాజీ వార్డు సభ్యులు చెల్పూరి విష్ణమాచారి,కూన మల్లయ్య,బండోజు రాజేందర్, తోట చంద్రయ్య,లింగమూర్తి,సదానందం, గట్టు కిరణ్,కంది మల్లారెడ్డి,తోట సంతోష్,పులి మణికంఠ,గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News